చెట్టును ఢీకొట్టి మంటల్లో కాలిపోయిన కారు.. ముగ్గురు ప్రయాణికులు..
వేగంగా వెళ్తున్న ఓ కారు చెట్టును ఢీకొట్టింది. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి కారు దగ్ధమైంది. అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కారు నుంచి వేగంగా దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. కారులో ప్రయాణించిన ముగ్గురూ వైద్యులే. వీరందరూ నేతర్హాట్ పర్వత ప్రాంత సందర్శనకు వెళ్తుండగా.. ఝూర్ఖండ్ గుమ్లాలోని ఘాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.