ఎడతెరిపి లేని వాన.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం! - చౌపాల్లో కుప్పకూలిన భవనం
Building Collapsed in Chopal: ఎడతెరిపి లేని వర్షాలతో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ శిమ్లా జిల్లాలోని చౌపాల్ బజార్లో జరిగింది. భవనంలో ఉన్నవారిని ముందే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. బిల్డింగ్ కూలిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భవంతిలో ఓ బ్యాంకు, రెండు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.