తెలంగాణ

telangana

ETV Bharat / videos

సరికొత్త స్టైల్లో పెళ్లి మండపానికి వధువు.. వరుడు షాక్​.. వీడియో వైరల్​! - betul news

By

Published : May 28, 2022, 6:13 PM IST

Betul Bride Drive Tractor: కాలం మారుతోంది. ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరుకుంటోంది యువత. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో వధూవరులు.. విచిత్ర వేషధారణలు, అదిరిపోయే ఎంట్రీలతో ఆకట్టుకోవడం ఇటీవల ఎక్కువైంది. మధ్యప్రదేశ్​లోని బైతూల్​లోనూ అచ్చం ఇలాంటిదే జరిగింది. పెళ్లి మండపానికి ట్రాక్టర్​ నడుపుకుంటూ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది వధువు. దీంతో వరుడు సహా అతడి కుటుంబం, స్థానికులు షాకయ్యారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఖాయీకేడాలోని జావ్రా గ్రామానికి చెందిన వాసు కవడ్కర్​తో.. ముల్తాయీకి చెందిన భారతీ తాగడేకు గురువారం రాత్రి వివాహం జరిగింది. అయితే పెళ్లిలో.. డోలీ, కారులో ఎంట్రీ ఇచ్చే సంప్రదాయం పాతబడిపోయిందని, అందుకే తాను ఈ కొత్త స్టైల్లో వచ్చినట్లు వివరించింది భారతి.

ABOUT THE AUTHOR

...view details