సింహాన్ని తరిమిన శునకం.. నెట్టింట వీడియో వైరల్
Dog Chases Lion: సింహాన్ని శునకం తరిమిన ఘటన గుజరాత్‌లో జరిగింది. రాజ్‌కోట్ జిల్లా లోధికా తాలుకా సాంగణ్వా గ్రామం సమీపంలో కొద్దిరోజులుగా సింహాలు సంచరిస్తున్నాయి. వాటిని ప్రత్యక్షంగా చూసేందుకు చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అడవి జంతువుల నుంచి.. పంటలను కాపాడేందుకు రైతులు అక్కడ ఓ శునకాన్ని కాపలాగా ఉంచారు. ఓ సింహాన్ని చూసిన ఆ శునకం ఏమాత్రం భయపడకుండా దాని వెంటపడింది. మృగరాజును సరిహద్దుల నుంచి వెళ్లగొట్టింది. జనం ఈ దృశ్యాలను కెమెరాల్లో బంధించగా.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.