'చెత్త వాహనం'పై స్టంట్స్.. ప్రమాదకరంగా పుష్అప్స్.. సడన్‌గా కిందపడి.. - చెత్త సేకరించే వాహనంపై పుష్అప్స్
చెత్త సేకరించే వాహనంపై ఓ యువకుడు ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ఆస్పత్రిపాలయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు చెత్త సేకరించే వాహనంపై పుష్అప్స్ చేస్తూ కనిపించాడు. అత్యంత వేగంగా వాహనం వెళ్తున్నప్పటికీ యువకుడు నిర్లక్ష్యంగా స్టంట్స్ చేశాడు. అయితే, కొద్దిసేపటికే అతడి ఉత్సాహం తలకిందులైంది. అదుపుతప్పి వాహనం పైనుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్, హరియాణా రాజధాని చండీగఢ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వ్యాను వెనక ఉన్న వాహనదారుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
Last Updated : Jul 17, 2022, 9:45 PM IST