తెలంగాణలో నయాగారా జలపాతం? చూస్తే ఇక మతిపోవాల్సిందే! - తెలంగాణలో ఉన్న జలపాతాలు
Telangana Niagara Falls: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో ఉన్న తెలంగాణ నయాగారా జలపాతంగా పేరు తెచ్చుకున్న బొగత జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. భారీ వర్షాల కారణంగా ఈ జలపాతం పొంగిపొర్లుతోంది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవి ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎత్తయిన కొండ కోనల నుంచి జాలువారిన నీరు నల్లన్దేవి వాగు, నేరేడు వాగు, చిలకముక్కు వాగు, పాలమడుగు వాగు, బిరుదుల వాగుల్లోకి పొంగిపొర్లుతూ బొగత జలపాతానికి చేరుకొని 50 ఫీట్ల ఎత్తులో నుంచి జాలువారుతూ జల సవ్వడి సంతరిస్తోంది.