ఫ్యాషన్ ప్రియుల మతిపొగొట్టిన సుందరాంగులు - ఫ్యాషన్ ప్రియుల మతిపొగొట్టిన సుందరాంగులు
Blenders Pride Fashion Show: చురుకత్తిలాంటి సుందరాంగులు తమ ఒంపుసొంపులతో ఫ్యాషన్ ప్రియుల మతిపొగొట్టారు. ర్యాంప్‌పై వయ్యారి హంసనడకలతో అదరహో అనిపించారు. ఫ్యాషన్ రంగంలో లోకల్ టాలెంట్‌ను ప్రొత్సహించేందుకు బ్లెండర్స్ ప్రైడ్ సంస్థ హైదరాబాద్‌లో 'బ్లెండర్స్ ప్రైడ్ నైట్' పేరుతో ఫ్యాషన్ షోను ఏర్పాటు చేసింది. డిజైనర్ అర్చనరావు రూపొందించిన డిజైనర్ వస్త్రాలను పలువురు మోడల్స్ ప్రదర్శించి మెప్పించారు. ఈ షోకు సినీ కథానాయిక ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక డిజైనర్లను ప్రోత్సహించేందుకు బ్లెండర్స్ ప్రైడ్ సంస్థ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి ప్రగ్యా జైస్వాల్ అన్నారు.