సప్తగిరులపై ప్రకృతి అందాలు..!
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రకృతి అందాలు నగరవాసులను పులకరింప చేశాయి. సప్తగిరుల మీదుగా కమ్ముకున్న కారుమబ్బులు.... కాచుకున్నట్లుగా కనిపించిన తిరుగిరుల దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను అలరించాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా.... ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. సంధ్యవేళ సప్తగిరుల మాటున సూర్యుడు అస్తమిస్తుండగా.... ముసురుకొచ్చిన నల్లమేఘాల దృశ్యాలు నగరవాసులను విశేషంగా అలరించాయి.