ఎమ్మెల్యే బూట్లు చోరీ.. అలానే నడుచుకుంటూ... - Sati Mata temple complex
ఉత్తర్ప్రదేశ్లో పూజల కోసం గుడికి వెళ్లిన ఓ భాజపా ఎమ్మెల్యేకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆగ్రా ఫతేహాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే ఛోటేలాల్ ధిమ్శ్రీలో ఉన్న సతీమాత ఆలయ సముదాయంలో ఏర్పాటు జాతరును ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయలో పూజలు కూడా చేశారు. గుడి నుంచి బయటకు రాగానే.. ఆయన బూట్లు కనపడలేదు. అధికారులు, పోలీసులు, స్థానికులు ఎంత వెతికినా ఉపయోగం లేదు. చివరకు పాదరక్షలు లేకుండానే ఆయన నడుచుకుంటూ.. దూరంగా పార్క్ చేసిన తన కారు వద్దకు వెళ్లారు. కాళ్లకు చెప్పులు లేకుండా ఆయన నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే బూట్లు చోరీకి గురికావడంపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. మీమర్స్ కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.