తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral Video కష్టాలు ఊరికే రావు పెళ్లి చేసుకుని ఎన్ని తిప్పలు పడ్డాడో పాపం

By

Published : Jun 1, 2022, 3:45 PM IST

Updated : Aug 13, 2022, 12:03 PM IST

డబ్బులు ఊరికే రావు, ఈ డైలాగ్​ తెలియనివారుండరు. కానీ, ఇది పాతదైపోయింది. మార్కెట్లోకి కొత్త స్లోగన్​ వచ్చేసింది. పెళ్లి అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నాడో కళ్యాణమనే కష్టాల ఊబిలో మునిగిపోయాడో, లగ్గంతో తిప్పలు అనే సబ్జెక్టులో పీహెచ్డీ చేశాడో వివాహం బంధంతో విసిగి వైరాగ్యం పుచ్చుకున్నాడో, తెలియదు కానీ తన అనుభవాన్ని రంగరించి సమాజానికి సైలెంట్​గా స్లేట్​తో సందేశాలిస్తున్నాడు. కష్టాలు ఊరికే రావు,పెళ్లి చేసుకుంటేనే వస్తాయి, భార్యలు తుఫాన్​లాంటోళ్లు గొడుగు పట్టుకుని నిల్చుంటే కష్టం, అంటూ వినూత్న కొటేషన్లతో ఓ వాహనదారుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బైక్​ వెనుక ఓ పలకను పెట్టి దానిపై ఇలాంటి కొటేషన్లు రాసుకుని తిరుగుతున్నాడు. కాస్తా విచిత్రంగా ఉన్నా నిజమే చెప్తున్నాడనుకున్న ఇంకో ఔత్సాహికుడు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఇంకేముంది ఆ కొటేషన్లతో కనెక్టయిన వాళ్లంతా ఆ వీడియోను తెగ వైరల్​ చేస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ ఓ లుక్కేయండి.
Last Updated : Aug 13, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details