పట్టాలపై నిలిచిపోయిన బైక్.. దూసుకొచ్చిన రైలు.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో.. - రైల్వే క్రాసింగ్ వద్ద యువకుడు మృతి
పట్టాలు దాటుతూ ఓ యువకుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని తహలీల్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగింది. లఖ్‌నవూకు చెందిన ప్రదీప్ కనోజియా(30) పట్టాలు దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా బైక్ ఆగిపోయింది. అయితే అతడు బైక్ మళ్లీ స్టార్ట్ చేస్తున్న క్రమంలో అటు వైపు నుంచి వస్తున్న రైలును గమనించలేదు. దీంతో ఒక్కసారిగా వచ్చిన రైలు ఢీకొట్టింది. బాధితుడు అక్కడిక్కడే మరణించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.