స్కూల్కు తల్వార్తో విద్యార్థి తండ్రి.. యూనిఫాం డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటూ... - యూనిఫాం డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయులను బెదిరించిన విద్యార్థి తండ్రి
బిహార్ ఆరారియాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. భగవాన్పుర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోన్న ఓ విద్యార్థికి యూనిఫాం డబ్బులు రాలేదని అతడి తండ్రి హల్చల్ చేశాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వాలని అక్బర్ అనే వ్యక్తి పెద్ద కత్తితో ఉపాధ్యాయులను బెదిరించాడు. వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. డీఈఓకు ఫిర్యాదు చేశారు.