రోడ్డు లేక అవస్థలు, భారీ వర్షంలో మంచంపైనే గర్భిణీని మోసుకెళ్తూ - గర్భవతిని కాలువ దాటించేందుకు ప్రయత్నాలు
వర్షాలు పడ్డాయంటే చాలా గ్రామాలు వరదలతో హోరెత్తుతాయి. ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్ రాజధానిలోనూ నెలకొంది. భోపాల్ బైరాసియా పరిధిలోని మైనాపురాలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అందులో ఒక గర్భిణీని కాలువ అవతలివైపుకు తీసుకొని వెళ్లడానికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువపై తాత్కాలికంగా ఒక వంతెనను నిర్మించి, ఆమెను మంచం మీద మోసుకెళ్తూ దాటించారు ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు. అలాగే మంచంపైనే ఆస్పత్రికి తరలించారు. ఓవైపు భారీ వర్షం, మరోవైపు ప్రమాదకరమైన వంతెన. సరైన రోడ్డు సౌకర్యం లేనందున వారిని ఈ సమస్య వెంటాడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.