షాకింగ్ వీడియో.. ఐస్‌క్రీం కోసమని వెళ్లిన నాలుగేళ్ల పాప ఉన్నట్టుండి.. - మహారాష్ట్ర నాశిక్ న్యూస్
మహారాష్ట్ర నాశిక్‌లో షాకింగ్ ఘటన జరిగింది. తన తండ్రితో కలిసి ఐస్‌క్రీం షాప్‌కు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి దురదృష్టవశాత్తు మరణించింది. ఫ్రిజ్‌ను పట్టుకున్న పాప కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. సిడ్కో ప్రాంతంలోని త్రిమూర్తి చౌక్‌లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన ఘటనా.. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అంతసేపు ఆనందంగా గడిపిన పాప.. ఉన్నట్లుండి వెనక్కి పడిపోయింది. ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించారు వైద్యులు. ఆమె మరణంతో చిన్నారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.