కేదార్‌నాథ్‌లో భారీ హిమపాతం.. ఒక్కసారిగా విరిగిపడ్డ మంచు పెళ్లలు! - केदारनाथ के ऊपर पहाड़ियों पर फिर हिमस्खलन
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హిమపాతం సంభవించింది. ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగి కొండల మీద నుంచి జారిపడ్డాయి. అయితే కేదార్నాథ్ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ముందు జాగ్రత్తలో భాగంగా విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు.