తెలంగాణ

telangana

ETV Bharat / videos

నటి సురేఖ వాణి భావోద్వేగం.. భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తుచేసుకుని.. - నటి సురేఖ వాణి భావోద్వేగం సినిమాలు

By

Published : Jul 18, 2022, 8:13 PM IST

Actress Surekha Emotional about her husband: యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి సురేఖ వాణి తెలుగులో తెరకెక్కిన 'భద్ర', 'దుబాయ్‌ శీను', 'బృందావనం', 'శ్రీమంతుడు', 'బొమ్మరిల్లు' చిత్రాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ కుర్రహీరోయిన్లతో సమానంగా గ్లామర్​ మెయిన్​టెయిన్​ చేస్తూ అదిరిపోయే ఫొటోలను పోస్ట్​ చేస్తున్నారు. అలానే ఇన్​స్టా రీల్స్​ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఈమె భర్త కొంత కాలం క్రితం అనారోగ్యంతో మరణించారు. అయితే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన భర్తతో గడిపిన చివరి క్షణాలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఆయనకు ఏమైంది? ఆయన బెడ్​పై ఉన్నప్పుడు తాను పడిన బాధను వివరించారామె. తన భర్త కుటుంబంతో ఉన్న విభేదాలు గురించి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details