హనుమకొండలో సందడి చేసిన హీరోయిన్ కృతిశెట్టి - షాపింగ్ మాల్ ప్రారంభించిన కృతిశెట్టి
హీరోయిన్ కృతిశెట్టి హనుమకొండలో సందడి చేశారు. నగరంలోని నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం మాల్‌లో కలియ తిరుగుతూ పలు వస్త్రాలు, ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. కృతిశెట్టిని చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్‌కు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడిన అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. వరంగల్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని కృతిశెట్టి తెలిపారు. స్టేజిపై డ్యాన్స్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.