డోలీలో నిండు గర్భిణీ.. అడవిలో 6కి.మీ నడక.. నాలుగు గంటల తర్వాత.. - woman carried in doli
ఎనిమిది నెలలు నిండిన గర్భవతిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో వెదురు డోలీలో మోసుకెళ్లారు ఆమె బంధువులు. సరైన రోడ్లు, అంబులెన్సు సదుపాయ లేకపోవడమే అందుకు కారణం. విమల్ బాయ్ దేవేంద్ర వాసవే అనే ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు గ్రామస్థుల సాయంతో సుమారు నాలుగు గంటల పాటు డోలీలో తీసుకెళ్లారు. ఆరు కిలోమీటర్ల దూరంలోని రాపాపుర్ చేరుకునే వరకు వారికి అంబులెన్సు దొరకలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా కువాలీదబర్ గ్రామంలో వెలుగు చూసింది. ఆస్పత్రికి వెళ్లాల్సిన ప్రతిసారి తమకు ఇదే పరిస్థితి ఎదురవుతోందని గ్రామస్థులు వాపోయారు.