తెలంగాణ

telangana

ETV Bharat / videos

బావిలో పడ్డ యువకుడు.. లక్కీగా అదే సమయానికి... - రాజ్​కోట్​లో బావిలో పడ్డ యువకుడు

By

Published : Jun 26, 2022, 3:20 PM IST

బావిలో పడ్డ యువకుడిని ఓ రైల్వే ఉద్యోగి చాకచక్యంగా కాపాడాడు. తొలుత తాడుతో యువకుడిని పైకి లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వారు 20 నిమిషాల్లో యువకుడిని సురక్షితంగా బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటన గుజరాత్​.. రాజ్​కోట్​లోని మేరీ గోల్డ్ అపార్ట్​మెంట్​లో జరిగింది. యువకుడిని ఏమైందని అడడగా.. తల తిరిగి బావిలో పడిపోయానని చెప్పాడు. అయితే యువకుడే బావిలో దూకాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత యువకుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడడానికి బావి వద్దకు వెళ్లాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details