తెలంగాణ

telangana

ETV Bharat / videos

రణ్​బీర్​- ఆలియా పెళ్లికి రాయల్​ గిఫ్ట్​ - 125 బంగారు పూలతో.. - alia ranbir surat fans gift

By

Published : Apr 13, 2022, 9:22 PM IST

Updated : Apr 13, 2022, 11:01 PM IST

బాలీవుడ్‌ లవ్​ బర్డ్స్ రణ్‌బీర్‌ కపూర్- ఆలియాభట్​ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ జంట పెళ్లి కోసం.. అటు అభిమానులతోపాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పెళ్లి నేపథ్యంలో అభిమానులు తమ స్టార్స్​ కోసం.. ప్రత్యేకమైన గిఫ్ట్స్​ పంపుతున్నారు. తాజాగా గుజరాత్​లోని సూరత్​కు చెందిన ఇద్దరు అభిమానులు.. ఆలియా- రణ్​బీర్​ కోసం ఒక రాయల్​ గిఫ్ట్​ను పంపారు. 24 క్యారెట్ల బంగారు పూత పోసిన 125 గులాబీ పూలు పొదిగిన ఒక పుష్పగుచ్ఛాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ ఇద్దరు అభిమానులూ బంగారం వ్యాపారులే. అయితే దాదాపు ఐదు అడుగులు ఉన్న ఈ రాయల్​ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Apr 13, 2022, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details