100 కిలోలు.. 14 అడుగుల భారీ పైథాన్.. గంటన్నర సేపు ముప్పుతిప్పలు
Huge python: కర్ణాటక చామరాజనగరలో ఓ భారీ పైథాన్ కాసేపు హడలెత్తించింది. బెలవట్టలోని డా. రాజేంద్రకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో.. పనిచేస్తున్న కూలీలకు కొండ చిలువ కంటపడింది. 100 కిలోలకుపైగా బరువు.. 14 అడుగుల పొడవు ఉన్న పామును చూసి.. వారు భయంతో పరుగులు పెట్టారు. పాములు పట్టే వ్యక్తికి యజమాని సమాచారం అందించగా.. అతడు వచ్చి గంటన్నర సేపు శోధించాడు. చివరకు దానిని పట్టుకొని.. ట్రాక్టర్లో తరలించి.. బిళిగిరి రంగనాథ ఆలయ టైగర్ రిజర్వ్ అడవుల్లో వదిలిపెట్టారు.