స్కూటీతో సహా మ్యాన్‌హోల్‌లో పడిపోయిన దంపతులు.. క్షణాల్లో..! - అలీగఢ్ పోలీస్ వీడియో
police family fell into a drain: ఓ పోలీసు అధికారి దంపతులు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో స్కూటీతో సహా పడిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది. దంపతులు ఇద్దరు స్కూటీపై ఆస్పత్రికి వెళ్తుండగా మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని కాపాడారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వరద నీరు వెళ్లేందుకు వీలుగా సిబ్బంది మ్యాన్‌హోల్‌ను తెరిచారు. కాగా మున్సిపల్ అధికారుల అలసత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.