పాదచారిపై ఒక్కసారిగా కూలిన చెట్టు.. లక్కీగా... - పుల్పల్లి చెట్టు కూలిన వీడియో
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఒక వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పుల్‌పల్లిలో బుధవారం కుంజుమాన్ అనే వ్యక్తి వర్షం కురుస్తున్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్దచెట్టు వెేళ్లతో సహా కూలి రోడ్డుపై పడింది. చెట్టు పడడాన్ని గమనించిన కుంజుమాన్ వేగంగా ముందుకు పరిగెత్తాడు. చెట్ల కొమ్మలు అతడికి రెండు వైపుల పడడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదు. కుంజుమాన్ చూడకపోయి ఉంటే చెట్టు కాండం సరిగ్గా అతడిపైనే పడేది.