ముంచెత్తిన వరద.. చూస్తుండగానే కూలిన పోలీస్ స్టేషన్
అసోంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అనేక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్బరి జిల్లాలోని రెండతస్తుల భంగ్నామరి పోలీస్ స్టేషన్ వరదల ధాటికి పాక్షికంగా కూలిపోయింది. ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అసోం విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు.