అప్పు తిరిగివ్వమని అడిగినందుకు క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టి - అప్పిచ్చిన వ్యక్తిని బ్యాట్‌తో హత్య
అప్పు తిరిగివ్వమని అడిగినందుకు క్రికెట్ బ్యాట్‌తో హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని మారత హళ్లి తాలుకా మున్నెకొళ్లాలలో జరిగింది. వెంకటప్ప అనే వ్యక్తి శివప్పకు మరో ఇద్దరి ద్వారా అప్పు ఇప్పించాడు. ఎంతకీ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో శివప్ప వద్దకు వచ్చిన వెంకటప్ప లోన్ కట్టమని అడిగాడు. అప్పు తిరిగిచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ మధ్యలో శివప్ప తన చేతిలో ఉన్న బ్యాట్‌తో వెంకటప్ప తలపై కొట్టాడు. దీంతో దెబ్బలకు తట్టుకోలేక వృద్ధాప్యంలో ఉన్న వెంకటప్ప అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి ఫలితం లేకుండా పోయింది. భారీ రక్తస్రావం కారణంగా వెంకటప్ప చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు శివప్పను అరెస్టు చేసిన మారతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.