తెలంగాణ

telangana

ETV Bharat / videos

మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా... పండగచేసుకున్న మందుబాబులు!! - మద్యం వాహనం బోల్తా

By

Published : May 24, 2022, 10:19 AM IST

నాగర్​ కర్నూల్ జిల్లా మంతటి చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తూ మద్యం తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. తిమ్మాజిపేట లిక్కర్ డిపో నుంచి రూ. 5 లక్షల మద్యం లోడుతో మినీ డీసీఎం అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి వెళ్తుంది. అయితే నాగర్​ కర్నూల్ మండలం మంతటి చౌరస్తా సమీపానికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఫలితంగా అందులో ఉన్న 40 బీర్ల కాటన్లు, 40 విస్కీ కాటన్లు రోడ్డుపై పడి చెల్లాచెదురయ్యాయి. ఇది చూసిన స్థానికులు ఎవరికి వారు అందినకాడికి మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 3 లక్షల మద్యం నేలపాలయ్యింది. కొంత స్థానికులు లూటీ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై నాగర్​ కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details