నడిరోడ్డుపై అడవి దున్న బీభత్సం.. ఒక్కసారిగా ఆటోను పైకి లేపి.. - బైసన్ గేది బీభత్సం
కేరళలోని పథనంతిట్టలో ఓ అడవి దున్న బీభత్సం సృష్టించింది. అంగమూజి-ప్లాపల్లి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై దాడికి దిగింది. కొమ్ములతో ఆటోను ఒక్కసారిగా పైకి లేపి పడేసింది. ఈ ఘటనలో ఆటో స్వల్పంగా దెబ్బతింది. తర్వాత మరోసారి ఆటోపై దాడిచేసేందుకు యత్నించింది. అదే సమయంలో చాకచక్యంగా వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు డ్రైవర్. చివరకు ఆ దున్న పక్కకు వెళ్లిపోయింది. ఈ సంఘటనను మెుత్తం రోడ్డుపై వెళ్తున్న మరో వాహనంలోని ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Sep 12, 2022, 4:42 PM IST