మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప.. ధర రూ.3 లక్షలపైనే.. - టెలియా చేపలో ఔషధ గుణాలు
మత్స్యకారుడి వలలో పడిన తెలియా జాతికి చెందిన ఓ చేప భారీ ధర పలికింది. 32 కేజీల బరువున్న ఈ చేపను కోల్కతాకు చెందిన ఓ ఫార్మసీ కంపెనీ రూ.3.10 లక్షలకు కొనుగోలు చేసింది. తెలియా చేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లే అంత ధర పలికిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఘటన ఒడిశా భద్రక్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ధమారా నదిలో దొరికిన ఈ చేపను చాందినిపల్ చేపల మార్కెట్లో వేలం వేయగా ఈ భారీ ధర పలికింది.