Suicide selfie Video: పోడు రైతు ఆత్మహత్యాయత్నం.. లైవ్ వీడియో తీసుకుని..! - పోడు రైతు ఆత్మహత్యాయత్నం
Suicide selfie Video: పోడు రైతు సెల్ఫీ లైవ్ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి యత్నించాడు. అటవీశాఖ అధికారులు తన ఐదెకరాల పొలాన్ని జేసీబీతో దున్నేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన జింక శ్రీశైలం అనే రైతు తన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేశారు. ఫారెస్ట్ అధికారుల తీరుతో ఆవేదనకు గురైన శ్రీశైలం.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగారు. మిరప సాగు కోసం రూ.50 వేలు పెట్టుబడి పెట్టానని వీడియోలో వివరించారు. పురుగుల మందు తాగిన శ్రీశైలంను కుటుంబసభ్యులు మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.