కస్టమర్స్‌లా ఎంట్రీ.. క్షణాల్లో బంగారం మాయం.. అక్కాతమ్ముళ్ల బిగ్ స్కామ్! - అక్కాతమ్ముళ్ల బంగారు ఆభరణాలు చోరీ
క్షణాల్లో బంగారు ఆభరణాలు మాయం చేసిన ఇద్దరు అక్కాతమ్ముళ్లను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న అహ్మదాబాద్‌లోని శివరంజనీ గోల్డ్ షోరూమ్‌కు పూనమ్ రంగ్వానీ అనే మహిళ వెళ్లింది. కొత్త మోడళ్ల బంగారు గాజులు, కంకణాలు చూపించమని అడిగింది. అనేక రకాలను వారు చూపించగా.. అందరి కళ్లుగప్పి రూ.75 వేలు విలువైన కంకణాన్ని ఆమె చోరీ చేసింది. అనంతరం ఏం తెలియనట్లు బయటకు వచ్చేసింది. ఈలోపల దుకాణం బయట ఆమె సోదరుడు కమలేశ్ రంగ్వానీ కారులో వేచి ఉన్నాడు. ఈమె కారు ఎక్కగానే.. ఇద్దరూ వేరే దుకాణానికి వెళ్లి ఆ బంగారు కంకణాన్ని విక్రయించారు. అయితే అదే రోజు శివరంజనీ షోరూమ్ మూసే సమయంలో వర్కర్లు ఆభరణాల స్టాక్ పరిశీలిస్తుండగా కంకణం మాయమైనట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తే.. ఇదంతా పూనమ్ రంగ్వానీ చేసిన పనిగా తేలింది. ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అహ్మదాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Last Updated : Sep 19, 2022, 5:34 PM IST