321 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. నినాదాలతో హోరెత్తించిన విద్యార్థులు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 321 అడుగుల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు ఎవరెస్ట్ పర్వతారోహకుల ఫారిన్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు. ఈ ర్యాలీ మహారాష్ట్ర సాతారా జిల్లాలోని లోనంద్ పట్టణంలో జరిగింది. ఈ భారీ జెండా ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 'భారత్ మాతాకీ జై', 'వందేమాతరం' అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ జెండాను తయారుచేయడంలో ఎవరెస్టు అధిరోహకుడు ప్రజిత్ పరదేశి చొరవ తీసుకున్నారు. ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొన్నారు.