తెలంగాణ

telangana

ETV Bharat / videos

బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి.. సురక్షితంగా బయటకు - child fell in borewell latest news

By

Published : Jun 8, 2022, 4:18 PM IST

boy fell in borewell: గుజరాత్​ సురేంద్రనగర్​లో రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ దళం, పోలీస్​, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 40 నిమిషాల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది.. బాలుడిని సురక్షితంగా బయటకు తీసింది. అనంతరం స్థానిక ఆస్పత్రికి అక్కడ నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. బోరుబావి లోతు సుమారు 25 ఫీట్లు ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details