12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం.. ఇంట్లోకి వెళ్తుండగా.. - ఉత్తరాఖండ్లో కింగ్ కోబ్రా
ఉత్తరాఖండ్ కోట్ద్వార్లోని హరేంద్రనగర్ ప్రాంతంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. 12 అడుగులకుపైగా పొడవున్న ఈ సర్పాన్ని చూసి జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నివాస ప్రాంతంలోకి వచ్చిన కోబ్రా.. అనిల్ రాటూరి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడుతుండగా గమనించారు. అటవీశాఖ అధికారులకు, పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పాములు పట్టే నైపుణ్యం ఉన్న జీతూ.. కింగ్ కోబ్రాను పట్టుకొని అడవిలో వదిలేశాడు. దీంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.