Viral Video: 11వేల వోల్టుల కరెంటు తీగ తాకి వ్యక్తి సజీవదహనం - Man Died In Bettiah
బిహార్లోని బేతియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. 11వేల వోల్టుల హెటెన్షన్ వైరు మీద పడి భూతి ప్రసాద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీగ తగలగానే మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. మృతుడు తన ఇంట్లోని తలుపు దగ్గర కూర్చున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.