తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాత పింఛన్​ కోసం అసెంబ్లీ ముట్టడి.. ఉద్యోగులపై జలఫిరంగులు - పాత ఫించన్​ పథకం

By

Published : Mar 4, 2022, 12:09 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

Employees Protested: కొత్త పింఛన్​ పథకం స్థానంలో పాత పింఛన్​ను అమలులోకి తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ హిమాచల్​ ప్రదేశ్​, సిమ్లాలోని అసెంబ్లీ ముందు వెయ్యి మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయితే, బారికేడ్లు, జలఫిరంగులను దాటుకుని శాసనసభ ముట్టడి చేపట్టారు ఉద్యోగులు. ఈ క్రమంలో ఉద్యోగులు, పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. మరోవైపు.. విపక్ష కాంగ్రెస్​, ఇతర పార్టీల నేతలు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. శాసనసభ నుంచి వాకౌట్​ చేశారు. సీఎం జైరామ్​ రమేశ్​ ప్రకటన చేసే వరకు నిరసనలు ఆగవని ఉద్యోగులు తేల్చి చెప్పారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తమ ఆందోళనను విరమించారు ఉద్యోగులు. భవిష్యత్తు కార్యాచరణపై కోర్​ కమిటీ భేటీలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details