షాకింగ్ వీడియో: కూతుర్ని చూసేందుకు బైక్పై వెళ్తూ.. - shocking accident
Raiganj Accident: కూతురిని చూసేందుకు బైక్పై వెళ్తుండగా రోడ్డుప్రమాదంలో మరణించాడు ఓ తండ్రి. బైక్ అదుపుతప్పి అతివేగంతో పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టగా.. అంతెత్తున ఎగిరి కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. బంగాల్ రాయ్గంజ్లోని మర్నాయ్ ప్రాంతం వద్ద జరిగిందీ ఘటన. మృతుడిని స్వపన్ కుమార్ బిశ్వాస్గా (61) గుర్తించారు. ఆ వ్యక్తి కోల్కతా నుంచి జల్పాయీగుడీకి వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST