NIT Fashion Show: అలరించిన ఫ్యాషన్ షో.. ఆకట్టుకున్న అమ్మాయిల హంసనడకలు - వరంగల్ నిట్
NIT Fashion Show: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. వసంతోత్సవాల వేడుకలో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. హంసనడకలతో చూపరులను మైమరిపించారు. వీటితో పాటు ప్రముఖ గాయకుడు దర్శన్ రావల్ పాటలు పాడి సందడి చేశారు. దర్శన్ రావల్ పాటలకు విద్యార్థులు స్టెప్పులతో అదరగొట్టారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా గడిపారు. డ్యాన్సులు చేస్తూ హంగామా చేశారు. మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST