ప్రతిధ్వని: నిర్లక్ష్యమే యువతను కరోనా వైపు నెడుతోందా? - prathidwani debate
మాకేం అవుతుందిలే అన్న అతి విశ్వాసం. అలా బయటకు వెళ్లినంత మాత్రాన వైరస్ వచ్చేస్తుందా.. అన్న అలసత్వం. పాజిటివ్ వస్తే ఏం చేయాలో మాకు తెలుసులే అని అతి తెలివి తేటలు. నిబంధనలు మాకు కాదు అనే పట్టని ధోరణలు. ఇవన్నీ వెరసి ఇప్పుడు కరోనా బాధితుల్లో యువత వాటాను అమాంతం పెంచేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో యువతరం భారీ సంఖ్యలో వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎంత చెప్పినా.. ఎన్ని సూచనలు అందిస్తున్నా వారి తీరులో మార్పు రావటం లేదు. లాక్‌డౌన్, ఆంక్షల మధ్య రోడ్లపై ఖాకీలకు చిక్కుతున్న కుర్రాళ్లే అందుకు ఓ నిదర్శనం. ఈ సంక్షోభ సమయంలో యువతలో ధోరణులను ఎలా చూడాలి. వారి తీరు మార్చే మార్గాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.