కొత్త ఏడాదికి... సరికొత్త ప్రణాళికలు - new year resolution 2020
నూతన సంవత్సరం....! కొత్తగా ఉండాలి. జీవితాన్ని నచ్చిన విధంగా మలుచుకోవాలి వంటి పలు ఆలోచనలతో అనేక ప్రణాళికలు రూపొందించుకుంటోంది యువతరం. గతేడాది నిర్ణయాల్లో... ఎంత మేరకు అమలు చేశాం. సాధించిన విజయాలు, విఫలమైనా అంశాలకు కారణాలు గుర్తించి... సరికొత్త లక్ష్యాలకు రూపకల్పన చేసుకుంటుంది. ఇదే రీతిలో ముందుకు సాగుతున్నారు... హైదరాబాద్ గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులు. గతేడాది విజయాల్ని నెమరువేసుకుంటూ... చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటూ నూతన సంవత్సరానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారో చుద్దాం...