Prathidwani: భాగ్యనగరానికి ఎందుకు ఈ కాలుష్య సమస్య? - హైదరాబాద్ కాలుష్యం వార్తలు
భాగ్యనగరం... ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రసాయనాల గాఢత తీవ్రమైన చోట్ల... కనీసం ఊపిరి పీల్చుకోవడానికే కష్టం అవుతోంది. శివారు ప్రాంతాలు మరింత దయనీయం. నిబంధనలు పాటించని అనేక పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో జనం అల్లాడుతున్నారు. రసాయన, బల్క్ డ్రగ్ పరిశ్రమలే దీనికి కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి. కొన్ని కాలనీల్లో... వాయు కాలుష్య బాధితులు కనీసం ఇంటికి ఒకరు ఉంటున్నారంటే... పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్నిచోట్ల వాంతులు, విరేచనాలు, తల తిరగడం, కళ్ల మంటలు, తదితర అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. అసలు ఎందుకీ వినాశకర పరిస్థితులు? అసలు కారణాలు ఎక్కడున్నాయి? పరిష్కారాలు ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.