Prathidwani: భూమి విలువ పెంపుదలతో ప్రయోజనాలు ఎవరెవరికి? - Telangana Land property prices may soar
రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను పెంచనుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు; అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ను బట్టి వేర్వేరు స్లాబుల్లో విలువలు పెంచనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువలను, బహిరంగ మార్కెట్‌లో వాటి వాస్తవ ధరలను హేతుబద్దీకరించే దిశగా ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో భూముల విలువలు పెరిగితే ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం సమకూరుతుంది? భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో ఎవరిపైన ఎంతెంత భారం పెరుగుతుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.