PRATHIDWANI: గాంధీ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన స్ఫూరి ఏంటి? - mahatma gandi
ప్రపంచానికి అహింసా మార్గాన్ని పోరాట రూపంగా అందించిన మహనీయుడు మన జాతిపిత మహాత్మాగాంధీ. వేర్వేరు మతాలు, భాషలు, సంస్కృతుల ప్రజల్ని ఏకం చేసి, భారతీయులు అందరినీ ఒకే జాతిగా నిలబెట్టిన గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఆసేతు హిమాచలం దేశభక్తిని రగిలించి, బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించిన మహా నాయకుడు మన పూజ్య బాపూజీ. గాంధీజీ మనకందించిన సత్యం, శాంతి, అహింస అనే ఆయుధాలు... నేటికీ మన సమాజంలో సామరస్యానికి రక్షణగా నిలుస్తున్నాయి. ఆ స్ఫూర్తిని తరతరాల పాటు కాపాడుకోవడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.