తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: యువత ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి..?

By

Published : Aug 14, 2020, 9:30 PM IST

స్వతంత్ర భారతం అనేక సవాళ్లను అధిగమిస్తూ.. ప్రగతి పథంలో దూసుకుపోతోంది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొని వృద్ధి సాధించాలంటే యువతే కీలకం. ఏ దేశ అభివృద్ధిలో అయినా... యువత నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన యువతను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే... భారత్​ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదు. ప్రస్తుత సంక్షోభంలోనూ యువత ఎదిగేందుకు అనేక అవకాశాలున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం యువత నైపుణ్యాలకే పెద్దపీట వేసింది. స్కిల్ ఇండియా లాంటి పథకాలు యువతకు అండగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో... యువత ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి..? యువతలో నైపుణ్యలేమి సమస్యలను ఎలా అధిగమించాలి..? దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంత కీలకం అనే అంశాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details