Prathidwani: డ్రగ్స్ కట్టడికి అడ్డుగా నిలుస్తోన్న సవాళ్లేంటి? - telangana drugs cases
మత్తుమాయలో ఎన్నో జీవితాలు చెల్లాచెదురు అవుతున్నాయి. రోజురోజుకీ ఇదొక భరించరాని భయంకరమైన సమస్యగా మారుతోంది. డ్రగ్స్ తయారీ, దొంగరవాణా మాఫియాల కాసుల వేటలో ఎంతోమంది అమాయకులు బలిపశువులు అవుతున్నారు. భవిష్యత్ అంధకారంగా మారుతోంది. కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వెలుగుచూస్తున్న ఘటనలు, గుట్టలు.. గుట్టలుగా పట్టుబడుతున్న మత్తుపదార్థాలు సమస్య ఏ స్థాయికి చేరిందో చెప్పకనే చెబుతున్నాయి. ఈ విలయాన్నిగుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంతో కార్యాచరణకు సిద్ధమవుతోంది. మరి ఆ చర్యలు ఎలా ఉంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.