లైవ్ వీడియో: మాదాపూర్ రోడ్డు ప్రమాదం దృశ్యాలు - మాదాపూర్ రోడ్డు ప్రమాదం వీడియో
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని 100ఫీట్ల రోడ్డులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏసుబాబు అనే వ్యక్తి మృతి చెందగా.. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన నవీన్ కుమార్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అతి వేగంగా వచ్చిన ఫెరారి కారు ఫుట్ పాత్‌పై నడుకుంటూ వెళుతున్న ఏసుబాబుపై దూసుకెళ్లింది. ప్రమాదంలో ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.