Upper Manair Dam : సుమనోహర దృశ్యం.. జల పరవళ్ల సోయగం - upper manair dam drone visuals
ఒకప్పుడు సాగునీటి కోసం అల్లాడిన నేల ఇప్పుడు జలపరవళ్లతో కళకళలాడుతోంది. బీడు భూములతో బోసిపోయిన పుడమి.. నేడు పచ్చని పొలాలతో పులకరిస్తోంది. భారీ వర్షాలతో.. పోటెత్తిన వరదతో ఎగువ మానేరు(Upper Manair Dam) పరవళ్లు తొక్కుతోంది. రైతుల ఆశలకు జీవం పోస్తూ.. జల సుప్రభాతమై.. జీనజీవన నాదమై.. పరవశిస్తోంది. గంభీర్రావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో ఎగువమానేరు, సింగసముద్రం, చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఈ జల సందడిని చూస్తూ ప్రకృతి ప్రేమికులు.. మురిసిపోతున్నారు. పుడమితల్లి ఒడిలో.. కేరింతలు కొడుతున్నారు.
Last Updated : Jul 26, 2021, 2:37 PM IST