Ramuni Gundalu temple: ప్రకృతి రమణీయం.. రామునిగుండాలలో పర్యాటకుల పరవశం - ramunigundalu temple
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామునిగుండాలు ప్రాంతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన గుట్ట, జలపాత పరవళ్లు, ఎటుచూసినా పచ్చదనంతో.. ప్రకృతి రమణీయతతో పర్యాటకులు పరవశించిపోతున్నారు. గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని.. అక్కణ్నుంచి జలపాతం చూసేందుకు తరలివెళ్తున్నారు. జలపాత సవ్వడితో కేరింతలు కొడుతున్నారు. గుట్టపై నుంచి చూస్తే.. గోదావరి పరవళ్లు, పచ్చని పంటపొలాలు, వాటి నుంచి వచ్చే పైరగాలి, ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గుగనుల.. వంటి దృశ్యాలు నయనానందకరంగా కనువిందు చేస్తున్నాయి. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.