ప్రతిధ్వని: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకునేనా..? - తాజా ప్రతిధ్వని
భారీ వర్షాలు, వరదలకు ఉభయ తెలుగురాష్ట్రాల్లో ప్రధాన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లడం వల్ల లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మిరప పంటలకు అత్యధికంగా నష్టం జరిగింది. మెుక్కజొన్న, మినుము, పెసర వంటి ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏఏ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ? ఏ స్థాయిలో పంట నష్టం ఉంది? ఈ దశలో మిగిలిన పంటలను కాపాడుకునే అవకాశం ఏ మేరకు ఉంది ? ప్రభుత్వాలు రైతులను ఏ విధంగా ఆదుకోవాలి ? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చ.