PRATIDHWANI: క్రిప్టో ఆదాయాలకు భద్రత ఉంటుందా? ఉండదా? - crypto market
PRATIDHWANI: అంతూపొంతూ లేకుండా సాగుతున్న క్రిప్టో మార్కెట్‌ను గుర్తించే లక్ష్యంతో క్రిప్టో లావాదేవీలపై ప్రభుత్వం నిర్దిష్టమైన పన్నుల విధానం ప్రకటించింది. ఇందుకోసం ఆదాయపన్ను వెల్లడిలో ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. బెట్టింగ్, గుర్రప్పందాలు, గేమింగ్ ఆదాయాలపై విధిస్తున్న తరహాలోనే ఇకపై క్రిప్టో ఆదాయాలపైనా పన్నుల విధానం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో క్రిప్టో ట్రేడింగ్‌కు చట్టబద్ధత ఉన్నట్లా? లేనట్లా? పన్నులు చెల్లించే క్రిప్టో ఆదాయాలకు భద్రత ఉంటుందా? ఉండదా? అసలు దేశంలో క్రిప్టో మార్కెట్ పరిమాణం ఎంతుంది? భవిష్యత్‌లో ఈ క్రిప్టో మార్కెట్ దశ-దిశ ఎలా ఉంటుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.