తెలంగాణ

telangana

ETV Bharat / videos

prathidhwani: హైటెక్‌ యుగంలో ఆత్మహత్యలు.. అసలెందుకిలా జరుగుతోంది? - prathidhwani discussion on suicides

By

Published : Sep 24, 2021, 9:48 PM IST

ప్రకృతిలో అత్యంత ఆశామయ జీవి మానవుడు. పరిణామ క్రమంలో ఎన్నోఆటుపోట్లు, ఎన్నెన్నో సంఘర్షణల్ని అలవోకగా దాటుకుని ముందుకు అడుగేసిన సాహసి. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా విశ్వాంతరాలు గాలిస్తున్న ఆధునిక మానవుడు.. హైటెక్‌ యుగంలో మాత్రం ఆత్మన్యూనత ముందు తడబడుతున్నాడు. ప్రేమ విఫలమయ్యందని ఒకరు.. ఉద్యోగం దొరకలేదని ఇంకొకరు.. ర్యాంకులు రాలేదని మరొకరు.. ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలతో యుద్ధం చేసే మనిషి.. తన సహజశైలికి విరుద్ధంగా నిరాశను ఆశ్రయిస్తున్నాడు. అసలు ఎందుకిలా? కొండలు పిండి చేసే గుండె ధైర్యం ఎందుకు ఢీలా పడుతోంది? భూమి- ఆకాశాల అనంత దూరాలను ఛేధిస్తున్న మనిషి.. అంతర్మథనంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు? అసలు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న మూలాలు ఎక్కడున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details